అడ్డంగా దొరికిపోయిన విజయసాయిరెడ్డి...


ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వద్ద టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఎప్పుడో అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. అయితే అది ఇంతవరకూ చర్చకు రాలేదనుకోండి. ఒకపక్క రెండు పార్టీలు పోరాటం చేసేది ప్రత్యేక హోదా కోసమే అయినా..ఎడమొహం, పెడ మొహం గానే పోరాటం చేస్తున్నారు. వైసీపీ నేతలు టీడీపీ విమర్శలు గుప్పిస్తుంటే.. టీడీపీ నేతలు వైసీపీ నేతలపై ప్రతి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ పోరాటం కాస్త ఇప్పుడు రివర్స్ అయింది. అసలు పోరాటాన్ని వదిలేసి వ్యక్తిగత దూషణలు చేసుకునే వరకు వెళ్లారు. దీనికి కారణం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మోడీ కాళ్ల మీద పడ్డారు అన్న వార్తలు రావడమే.

 

ఈ వార్తలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో హోదా కోసం నినదించిన నోర్లు కాస్త సాయంత్రానికి ఒకరిపై ఒకరు ఎదురు దాడులకు దిగాయి. ఇప్పటికే ఒక పక్క హోదా కావాలని నాటకాలు ఆడుతూ.. విజయసాయిరెడ్డి మోడీ చుట్టూ తిరగడం ఏంటీ అని టీడీపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో దానిపై స్పందించిన విజయసాయిరెడ్డి నేను మోడీని కలుస్తా... ఎన్నిసార్లైనా కలుస్తా.. మీకేంటీ.. చంద్రబాబును జైలు పంపించే వరకూ కలుస్తా అని చిందులు వేశారు. ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో మరోసారి కోపంతో ఊగిపోయారు విజయసాయిరెడ్డిగారు. మోడీ కాళ్లు తను మొక్కినట్టుగా అసత్య ప్రచారం చేస్తున్నట్టుగా విజయసాయి రెడ్డి చంద్రబాబుపై తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని, బాబు నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడివి అయితే ఇలాంటివి చౌకబారు కామెంట్స్ చేయవని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్దం నెలకొంది. దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

 

వైసీపీపై టీడీపీ ఎదురుదాడి మొదలు పెట్టింది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఈ సమయంలో టీడీపీ సవాల్ ను స్వీకరించిన విజయసాయి రెడ్డి.. పుటేజ్ బయట పెట్టాలంటూ.. రాజ్యసభకు లెటర్ రాశారు. అప్పుడు ఎవరు కాళ్లు మొక్కారో తెలుస్తుందని అన్నారు. అయితే ఈ లెటర్ ను చూసిన టీడీపీ నేతలు విజయసాయిరెడ్డి అడ్డంగా దొరికిపోయారని అన్నారు. ఎందుకంటే... మార్చ్ నెల రాయాల్సింది దగ్గర.. ఆగష్టు అని రాసి మోసం చేశారని... ఇక్కడే దొరికిపోయాడంటూ చెబుతుంది. ఇప్పుడు కనుక వెంకయ్య నాయుడు ఆ పుటేజ్ ని బయటపెడితే విజయసాయిరెడ్డి అసలు బాగోతం బయపడుతుందంటూ టీడీపీ చెబుతుంది. దీంతో ఇప్పుడు వెంకయ్య నాయుడు నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో..