TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జైలులో జగన్‌ ఎవరెవరికి ఫోను చేశారు?

Published on: Sat Oct 20, 2012 10:59AM

YSRCP President, YS Jagan Mohan Reddy, Chanchalguda Jail, Telephones, TDP Leaders Demand, Jail Workers Cellphones, Usage, Yanamala Ramakrishnudu, Jails DGP, Letter

 

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి ఎవరెవరికి ఫోను చేశారు?  అన్న విషయం తేల్చాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండు చేస్తున్నారు.  ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్‌ జైలు సిబ్బంది సెల్‌ఫోనులను వినియోగించుకుంటున్నారన్న వార్త లీకైంది. దీంతో సిబ్బంది సెల్‌ నుంచి జగన్‌ ఎవరెవరికి ఫోనులు చేశారో తేల్చాలని తెలుగుదేశం పార్టీ నేతలు కోరుతున్నారు. ఆ నేతల తరుపున యనమల రామకృష్ణుడు జైళ్ల శాఖ డిజిపికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో జగన్‌ ఇంత వరకూ ఎవరెవరికి ఫోనులు చేశారో వివరాలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండు చేశారు. అధికారుల సెల్‌ఫోన్లతోనే జగన్‌ తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల బయట ఉన్నప్పుడు చేసే కార్యకలాపాలు ఏవీ ఆగలేదనటానికి ఈ సెల్‌ వినియోగమే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. అందువల్ల అధికారులు ఆ వివరాలు వీలైనంత త్వరగా బయటపెట్టాలని డిజిపిని కోరారు.