TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైఎస్సార్సీపీ నాయకుడి దారుణ హత్య

Published on: Mon Sep 1, 2014 1:52PM

 

అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ను సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కణేకల్లు మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ను దుండగులు కాల్చిచంపారు. విశ్వనాథ్ కణేకల్లు వెళ్తుండగా దుండగులు మాల్యం వద్ద ఆయనపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ సర్పంచ్ విశ్వనాథ్ అక్కడికక్కడే చనిపోయారు. విశ్వనాథ్‌ని చంపిందెవరో ఇంకా తెలియరాలేదు.