TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నరకాసుర వధ చేస్తావా? అది నువ్వే జగన్!

Published on: Wed Jul 23, 2014 9:24PM

 

రైతుల రుణ మాఫీ విషయంలో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశాడని లేనిపోని ఆరోపణని రెడీ చేసుకున్న వైకాపా మూడు రోజులపాటు ‘నరకాసురవధ’ పేరుతో దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ ఈ దిష్టిబొమ్మల గోల చేయనున్నారు. జగన్ ఎప్పుడైతే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించాడో వెంటనే తెలుగుదేశం నాయకులు జగన్ మీద గయ్యిమని విరుచుకుపడ్డారు. మాటలతో ఎదురుదాడి చేసి జగన్ గాలితీశారు.