మిథున్ రెడ్డి బెయిల్ ను తిరస్కరించిన కోర్టు..
Published on: Thu Jan 21, 2016 9:09AM

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ ను తిరుపతి కోర్టు తిరస్కరించింది. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఎంపీ మిథున్ రెడ్డి ఎయిర్ ఇండియా మేనేజర్ పై చేయి చేసుకొని నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. దీనికిగాను మిథున్ రెడ్డిని కొద్దిరోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈనేపథ్యంలో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఇప్పుడు అతని బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు తిరస్కరించింది.


