జగన్‌తో జనసేన రణవ్యూహం
Published on: Wed Aug 22, 2018 1:14PM

జనసేన రణవ్యూహం సిద్దమైంది. ఒకపక్క ఎన్నికల సమరానికి సిద్ధపడుతూనే... మరో పక్క అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీని ఎలా పడగొట్టాలా అని ఆలోచిస్తుంది. వీరితో పాటు ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదికారంలో వున్న పార్టీనే టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా గత ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం, బిజేపీ పార్టీలకు మద్దతు తెలిపి ఆ పార్టీల విజయానికి దోహదపడింది. ఇప్పుడు మాత్రం జనసేనా పార్టీ తన మద్దతును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నట్లు రాబోయే ఎన్నికలలో తన మద్దతు జగన్ మోహన్ రెడ్డికే ఉంటుందని పవన్ కళ్యాణ్ తనతో చెప్పినట్లుగా వైసీపీ నేత, తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ గతంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి అభిప్రాయాలనే వెలిబుచ్చారు వరప్రసాద్. వచ్చే ఎన్నికలలో వైసీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని, త్వరలో రెండు పార్టీలు కలుస్తాయని అన్నారు. జనసేనా పార్టీ టీడీపీకి వ్యతిరేకంగా ఒంటరిపోరాటం చేస్తున్న సమయంలోనే జనసేనా పార్టీది ఒంటరిపోరు కాదని వైయస్ఆర్ కాంగ్రెస్‌తో కలిసి పోరాడుతోందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి... ఈ వార్తలను అతి త్వరలోనే రెండు పార్టీలు నిజం చేయబోతున్నాయి అంటూ ప్రచారం చేస్తున్నారు ఈ వైసీపీ నేత. చూద్దాం రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగోచ్చు.


