పీకే చీప్ ట్రిక్స్ బయటపెట్టిన లగడపాటి...

 

లగడపాటి రాజగోపాల్ సర్వేల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లగడపాటి సర్వే చేస్తే అది దాదాపు నిజమే అన్న పేరు పడిపోయింది. అంతలా పేరు తెచ్చుకున్నాడు. అయితే అన్ని సర్వేలు నిజం కావులెండీ.. ఒకటో రెండో బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా లగడపాటి మరో విషయాన్ని గుట్టురట్టు చేశారు. ఇంతకీ ఏంటా గుట్టు అనుకుంటున్నారా..? ఏంటంటే..తాను సర్వే చేసినట్టు.. సర్వేకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. ఇంతకీ ఆ సర్వేలో ఏముందో తెలుసా... వచ్చే ఎన్నికల్లో, వైసిపీకి 105 సీట్లు వస్తాయని...  తెలుగుదేశం పార్టీకి 55 సీట్లు, జనసేనకు 15 సీట్లు వస్తాయి అంటూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసింది. ఇక ఈ సర్వేపై లగడపాటి స్పందిస్తూ.. తాను ఇప్పటి వరకు ఏ సర్వే చెయ్యలేదు అని చెప్పారు. ఎలక్షన్స్ ఆరు నెలలు ముందు నుంచి సర్వేలు మొదలు పెడతానని, మీకు చెప్పే ఆ పని చేస్తాను అని, రిజల్ట్స్ కూడా నేనే చెప్తానని, మీడియాకు చెప్పి, ప్రస్తుతం తన పేరు మీద జరుగుతున్న సర్వే ప్రచారం తప్పు అని చెప్పారు... అలాగే, నా పేరుతో వచ్చే ఏ సర్వే ప్రచారం నమ్మవద్దు అని, ఏదన్నా సర్వే ఉంటె నేనే స్వయంగా చెప్తానని లగడపాటి చెప్పారు.

 

ఇంతకీ ఈ ఫేక్ సర్వే సృష్టికర్త ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరూ వైసీపీ ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్. లగడపాటి సర్వే చేశారు అని ఈ ఫేక్ సర్వే తెరపైకి తెచ్చారు. అక్కడితో ఆగకుండా... దాన్ని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. ఇక ఒకసారి విషయం సోషల్ మీడియాకు ఎక్కిందంటే చాలు.. అది అందరికీ చేరినట్టే.. అలా ఈసర్వే లగడపాటి వరకు చేరింది. దీంతో లగడపాటి అసలు నిజం బయటపెట్టారు. మొత్తానికి పీకే గారి చీప్ ట్రిక్స్ మరోసారి బయటపడ్డాయి..