సువార్త సభల్లో వైకాపా జెండాలు

 

 

 

రాజకీయాలని, మతాన్ని కలపడంలో జగన్ ఫ్యామిలీ ఎప్పుడో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా ఇలాంటి మత రాజకీయాలకు వైకాపా మరింత ఉత్సాహంగా పాల్పడుతోంది. ప్రస్తుతం సీమాంధ్రలో ఎక్కడ క్రైస్తవ సభలు జరిగినా అక్కడకి వైకాపా నాయకులు ప్రత్యక్షమైపోతున్నారు. మనం మనం ఒకటి అంటూ ఓట్లు అడుగుతున్నారు. ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటూ వుంటే మధ్యలో మీ రాజకీయాల గోలేంటని క్రైస్తవులు విసుక్కుంటున్నా వినకుండా వైకాపా వర్గాలు భక్తిబాటలో ఓట్ల వేటకి వెళ్తున్నారు. లేటెస్ట్ గా కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని అద్దాడలో జరుగుతున్న సువార్త సభల్లోకి జగన్ బావమరిది బ్రదర్ అనిల్, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కల్పన వచ్చారు. అక్కడ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఎవరో అడిగితే మేం ప్రచారానికి రాలేదు ప్రార్థన చేయడానికి వచ్చామని చెప్పారు. అయితే వీళ్ళంతా వచ్చిన వాహనాకు వైసీపీ జెండాలున్నాయి. ఇలా జెండాలతో రావడం ఎన్నికల ప్రచారం కిందే వస్తుందని ఎవరో అనడంతో అందరూ అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.