జగన్ పార్టీలో చేరిన బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు
Published on: Wed May 30, 2012 3:37PM
బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు రంగారావు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గం నుంచి రంగారావు వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మంత్రి పదవిని ఆశించారు. అయితే బొత్స కుటుంబ హవా నేపథ్యంలో రంగారావుకి మంత్రివర్గంలో చోటు దక్కలేదు.దీనితో అసంతృప్తితో ఉన్న రంగారావు కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించారు.


