TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జనం గుండెల్లో నాన్న.. షర్మిల

Published on: Tue Sep 2, 2025 11:22AM

తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జనం గుండెల్లో నిలిచిపోయారని, ఆయన మరణించి 16 ఏళ్ల అయినా నేటికీ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు  షర్మిల అన్నారు. తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ ఘాటు వద్ద తన తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా  నివాళులర్పించారు.

ప్రత్యేక ప్రార్థన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహానేత వైయస్సార్   ఆరోగ్యశ్రీ ,ఉచిత విద్యుత్తు, ఫీజు రీయంబర్స్మెంట్, పథకాలు తీసుకువచ్చారనీ, అవి  వైయస్సార్ గుండెల్లో నుంచి పుట్టిన పథకాలని అన్నారు.  వైఎస్ఆర్ కు ఇంత ఆదరణ ఇచ్చిన  ప్రతి ఒక్కరికి కృతజ్ణతలు తెలిపారు.  వైయస్సార్ చనిపోయాక ఆ బాధ భరించలేక 700 మంది చనిపోయారని ఆ కుటుంబాలకు కూడా నివాళులర్పిస్తున్నానని తెలిపారు