విజయమ్మ కన్నీటిబొట్లకు విలువ!
Published on: Wed Jun 13, 2012 10:55AM
ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తన కుమారుడి గురించి రాల్చిన కన్నీటి బోట్లకు మన ఆంధ్రా ఓటర్లు విలువ ఇచ్చారు. అందుకే ఫలితాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, సానుబూతి బాగా పనిచేసిందని సర్వేలు, మీడియా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంచనాల ప్రకారం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 16 స్థానాల వరకూ రావచ్చని లెక్కలు వినిపించాయి. సహజంగా ఇటువంటి లెక్కలు ఎక్కడ వచ్చినా ముందస్తు భవిష్యత్తు చెప్పే విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ కూడా ఈ అంచనాలు కరెక్టే అంటున్నారు. ఆయన వేసిన లెక్కల ప్రకారం కూడా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 16 స్థానాలు రావచ్చట. కాంగ్రెస్ కు 1 నుంచి 3 సీట్లు, తెలుగుదేశంపార్టీకి 2సీట్లు వచ్చే అవకాశముందని ఆయన తేల్చేస్తున్నారు. పరకాలలో మాత్రం టి.ఆర్.ఎస్. గెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే తన లెక్క తెలుగుదేశంపార్టీ విషయంలో ఏమైనా మార్పు ఉండొచ్చు కానీ, మిగతా ఎక్కడా మారాడని లగడపాటి జోస్యం చెప్పేశారు. ఎన్నికలు పూర్తయ్యాక ఈయన చెప్పిన జోస్యం ఇంతకు ముందు అన్ని మీడియాలు చెప్పినవే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకోండి! కానీ, ఆయనే సొంతంగా శోధించి కనుగొన్న విషయంలా లగడపాటి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం మాత్రం అవే విషయాలు రాసి ఉన్న ప్రతినిథులకు బాధగా అనిపించాయి. మేము రాసిన సర్వేలే మాకు చెప్పి తిరిగి రాయమంటున్నారని ఆ ప్రతినిథుల ఆత్మఘోష మాత్రం లగడపాటి పట్టించుకోకుండా జాన్తానై అన్నట్లు చూస్తారు.


