TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్మోహనరెడ్డి మెడకు ఎన్ ఫోర్స్ మెంట్ ఉచ్చు.

Published on: Wed May 16, 2012 10:51AM

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డికి మరో అవాంతరం ఎదురైంది. ఇప్పటికే సిబీఐ విచారణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్మోహనరెడ్డిపై కేంద్రప్రభుత్వానికి చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విదేశీనిదుల దుర్వినియోగంపై కేసు నమోదు చేయబోతోంది. సిబీఐ చట్టాల కన్నా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ చట్టాల కింద అరెస్టు అయిన వారికి రెండేళ్ళ వరకూ బెయిల్ కూడా లభించదు.

 

 

 

నిజానికి జగన్మోహనరెడ్డి సిబీఐ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ఆ సంస్థపై ఎదురుదాడులకు దిగారు. సిబీఐ అంటే కాంగ్రెస్ ఇన్వేష్టిగేషన్ బ్యూరో అంటూ ఎద్దేవా చేశాయు. దీనికి తగ్గట్టుగానే సిబీఐ కూడా జగన్మోహనరెడ్డి అరెస్టుపై కాలాయాపన చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను రంగంలోకి దింపింది. ఈ సంస్థకు ఇప్పటికే సిబీఐ నుంచి సమాచారం కూడా వెళ్ళింది. జగన్ కంపెనీలకు అక్రమమార్గంలో విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయని తెలుస్తోంది. దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తోంది.