TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుపై పిర్యాదుకు జగన్ డిల్లీ పయనం

Published on: Mon Jun 8, 2015 4:47PM

 

సార్వత్రిక ఎన్నికలలో తన పార్టీకి అధికారం దక్కకుండా చేసి, తన ముఖ్యమంత్రి కలలను భగ్నం చేసినందుకు వైకాపా అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఊహించని విధంగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఆయనకి ఒక ఆయుధంగా దొరకడంతో దానిని పట్టుకొని ఆయన, వైకాపా పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. సాక్షి మీడియాలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తూ రకరకాల కధనాలు ప్రసారం చేస్తోంది. రేవంత్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడులపై ఇదివరకే గవర్నర్ కి ని కలిసి పిర్యాదు చేసిన జగన్, రేపు సాయంత్రం చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్ళబోతున్న సంగతి తెలియగానే, ఆయన కంటే ముందు జగన్మోహన్ రెడ్డి కూడా హడావుడిగా ఈరోజు సాయంత్రం డిల్లీ బయలుదేరిపోతున్నారు. అక్కడ రాష్ట్రపతిని, హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసి చంద్రబాబు నాయుడుపై పిర్యాదు చేయబోతున్నారు.

 

డిల్లీ వెళ్ళినప్పుడల్లా జాతీయ మీడియాతో రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏదో ఒకటి చెడుగా మాట్లాడటం ఆనవాయితీగా పాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈసారి మరింత రెచ్చిపోవచ్చును. తద్వారా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వం, జాతీయ మీడియాల ముందు ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు కల్పించాలని తహతహలాడుతున్నారేమో? ముఖ్యమంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ధర్నాలు చేపట్టబోతోంది. అయితే ఇవే పనులు ఆయన తెలంగాణాలో చేసి ఉండి ఉంటే దాని పరిణామాలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకోవాలంటే గత ఏడాది కాలంగా తెలంగాణాలో జరిగిన సంఘటనలన్నిటినీ నెమరు వేసుకొంటే చాలు.