TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ సీన్ క్లైమాక్స్ కు ‌:గాలి

Published on: Tue Jan 24, 2012 1:57PM

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు  వైయస్ జగన్ సీన్ క్లైమాక్స్‌కు చేరుకుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.సునీల్ రెడ్డి అరెస్టు తర్వాత జరిగే అరెస్టు వైయస్ జగన్‌ దేనని అయన  వ్యాఖ్యానించారు. ఆయన  కాంగ్రెసు నాయకత్వంతో వైయస్ జగన్ బేరసారాలకు దిగారని, సెటిల్‌మెంట్ కుదిరినట్లు లేదని ఆయన అన్నారు. పేదల భూములను దోచుకున్న పాపం వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి తగులుతుందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మనీ లాండరింగ్‌కు ఎలా పాల్పడిందో తాము శాసనసభలోనే సుదీర్ఘంగా వివరించినట్లు ఆయన తెలిపారు.
కాగా తూర్పు గోదావరి జిల్లాలో అంబెద్కర్  విగ్రహాల కూల్చివేతపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. విగ్రహాల కూల్చివేత వెనక కాంగ్రెసు పార్టీవారే ఉన్నారని, అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. నల్లగొండ జిల్లా కోదాడలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని కూల్చినవారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆయన విమర్సించారు.