TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైఎస్ఆర్‌సీ,టీఆర్ఎస్‌లు పొత్తు ఖాయం :టిడిపి

Published on: Thu Jan 12, 2012 8:50AM

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్ తో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు పొత్తు పెట్టుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారని తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు టి.పెద్దిరెడ్డి, ధూళిపాళ్ళ నరేంద్ర తదితరులు ఆరోపించారు.దీనిపై వారు మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీ, టీఆర్ఎస్‌లు పొత్తు పెట్టుకుని పోటీ చేయడం ఖాయమని వారు జోస్యం చెప్పారు.ఇకపోతే రైతుల పేరుతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జగన్ దీక్షకు కూర్చోవడం పగటి వేషంగా వారు అభివర్ణించారు. జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆర్మూర్‌లోనే ఎర్రజొన్న రైతులపై కాల్పులు జరిపించారని, దానికి జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రైతులు ఎరువుల కోసం దుకాణాల ముందు నిలబడితే జగన్ మేనమామ మాత్రం వాటిని తన ప్లాంట్లకు తరలించుకున్నారని, అప్పుడు జగన్ ఏమాత్రం రైతుల పేరుతో దీక్షలకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే, రైతుల సమస్యలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి తెలియవని ఎద్దేవా చేశారు. పండుగగా ఉన్న వ్యవసాయాన్ని దండుగగా మార్చారని వారు విమర్శించారు.