TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యాత్రలపై కోదండరామ్,బాపూజీ మండిపాటు

Published on: Wed Jan 11, 2012 3:20PM

నల్గొండ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు  వైయస్ జగన్  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ యాత్రలపై తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పరోక్షంగా మండిపడ్డారు. తెలంగాణ పట్ల ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదని కొండా లక్ష్మణ్ అన్నారు. రాజకీయ పార్టీలు ఏవైనా ఆందోళనలు తెలంగాణలో రాజకీయ ప్రాధాన్యత కోసమేనన్నారు. తెలంగాణలోని రాజకీయ పార్టీలకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. జై ఆంధ్ర వంటి ఉద్యమం వస్తేనే తెలంగాణ సాధించగలుగుతామన్నారు. మంత్రుల చేతకానితనం వల్లనే తెలంగాణ ప్రజలపై పోలీసులు దౌర్జన్యాలు చేస్తున్నారని కోదండరామ్ వేరుగా నల్గొండ జిల్లాలో అన్నారు. జగన్, చంద్రబాబు ఇలా సీమాంధ్రకు చెందిన అందరు నేతలు ఒక్కటై తెలంగాణవాదం లేదని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సంపన్న వర్గాల ఆధిపత్యం వల్లే తెలంగాణ వెనుకబాటుకు గురవుతోందన్నారు. తెలంగాణ ఉద్యమం బలమైన శక్తిగా ఎదగడంతో ప్రపంచస్థాయిలో తెలంగాణ అంశం బలపడిందన్నారు. ఉద్యమ రూపంలో విద్యార్థులు మరింత బలమైన శక్తిగా మారాలన్నారు.