TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజకీయమంటే యాంకరింగ్ కాదు:జగ్గారెడ్డి ఫైర్

Published on: Wed Jan 11, 2012 3:10PM

మెదక్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, సినీ నటి రోజా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయ ప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. రోజాకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌ను విమర్శించే హక్కు లేదన్నారు. రాజకీయమంటే యాంకరింగ్ కాదన్నారు. ఇది సినీ జీవితం అంతకంటే కాదన్నారు. త్వరలో కెసిఆర్ బండారం బయటపడుతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో టిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని విమర్శించారు. కెసిఆర్‌తో ఒప్పందం వల్లే వైయస్సార్ కాంగ్రెసు ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని విమర్శించారు. తెలంగాణకు అభివృద్ధే ముఖ్యమని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెబుతానని ఆయన అన్నారు.