మ్యాచ్ ఫిక్సింగ్ తో జగన్ దీక్షను సక్సెస్: ఎర్రబెల్లి
Published on: Tue Jan 10, 2012 2:21PM
హైదరా
బాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆర్మూర్ రైతు దీక్షకు తెరాస, తెలంగాణ జెఎసి పరోక్షంగా సహకరించాయని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.తెరాస, కాంగ్రెసు, తెలంగాణ జెఎసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి జగన్ ఆర్మూర్ పర్యటనను విజయవంతం చేశాయని అయన విమర్శించారు. కావాలనే తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు హౌస్ అరెస్టయ్యారని ఆయన ఆరోపించారు. వైయస్ జగన్ తెలంగాణ ద్రోహి అని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. జగన్ పార్లమెంటులో సమైక్యవాద ప్లకార్డులను ప్రదర్శించిన విషయం గుర్తు లేదా అని ఆయన అడిగారు.


