TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వారినే దోషులుగా పరిగణిస్తున్నారన్న పయ్యావుల

Published on: Mon Jan 9, 2012 4:15PM

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజలందరూ అంబటి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ను  ఇద్దరిని దోషులుగానే పరిగణిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్  ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ఎమ్మార్ కేసు విచారణలో భాగంగా సిబిఐ అధికారులు తన సంగతి అడిగితే తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును విచారించాలని అడగడటం  అంబటి  అతితెలివితేటలకు నిదర్శనమని  విమర్శించారు. మొదట అంబటి తన నిజాయితి నిరూపించుకొని ఇతరుల గురించి మాట్లాడాలని సూచించారు.ఎమ్మార్‌లో అంబటి రాంబాబు పాత్ర స్పష్టమైందన్నారు. సిబిఐ విచారణలో అన్నీ వెల్లడవుతాయన్నారు. భువితేజ బయటకు వస్తే రాంబాబు చరిత్ర బట్టబయలవుతుందన్నారు. ప్రజాధనం లూఠీ చేసిన వారు చంద్రబాబు పైన విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు.

 కాగా మద్యం మాఫియాపై ఎసిబి నివేదిక బయటపెట్టి ఉంటే మైలవరం సంఘటన జరిగి ఉండేది కాదని మరో నేత దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. నివేదిక బయట పెడితే ప్రభుత్వం కూలుతుందనే భయంతోనే మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. కల్తీసారా కారణంగా 19 మంది చనిపోతే ప్రభుత్వం నుండి ఎవరూ పరామర్శించలేదని, కనీసం స్థానిక ఎంపీ లగడపాటి రాజగోపాల్ పరామర్శించలేదని విమర్శించారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మాఫియా కింగ్ అని ధ్వజమెత్తారు.