జై తెలంగాణ అంటేనే జగన్‌ను నమ్ముతారు:కెటిఆర్
Published on: Tue Jan 3, 2012 4:14PM
వరంగల్: వై
యస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసినంత మాత్రాన ఇక్కడి ప్రజలు ఆయనను నమ్మరని చ్చే పార్లమెంటు సమావేశాల్లో జై తెలంగాణ అంటేనే ఇక్కడి వారు నమ్ముతారని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సీమాంధ్ర నేతలంతా తెలంగాణ వ్యతిరేకులేనని విమర్శించారు. ప్రభుత్వం మద్యం సిండికేట్‌లో ఎసిబి వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సిండికేట్లతో సంబంధం ఉన్న వారిపై కేసులు పెట్టాలన్నారు. ఇసుక మాఫియాతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ అంశంపై తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. తెలంగాణ కోసం ఏడువందల మంది విద్యార్థులు, యువకులు చనిపోతే పరామర్శించని బాబు కల్తీ సారా మృతులను పరామర్శించడం ఏమిటన్నారు.
కాగా జగన్ తెలంగాణలో యాత్ర చేస్తే ఏం చేయాలో తెలంగాణవాదులకు తెలుసునని టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ వేరుగా వరంగల్ జిల్లాలో అన్నారు.


