TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో అడుగు మోపనున్న జగన్

Published on: Tue Jan 3, 2012 3:26PM

హైదరాబాద్:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ నాయకులు  సమావేశమైన, వైయస్ జగన్ తెలంగాణ  పర్యటనను ఖరారు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో వైయస్ జగన్ 48 గంటల పాటు రైతు దీక్ష చేస్తారని పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో వైయస్ జగన్ దీక్ష చేస్తారని ఆయన చెప్పారు. జగన్ దీక్ష 10వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభమై 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని ఆయన చెప్పారు. ఈ దీక్షలో తెలంగాణ రైతులు పెద్ద యెత్తున పాల్గొంటారని ఆయన చెప్పారు.తెలంగాణలో రైతు బతుకులు అధ్వాన్నంగా మారాయని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మహారాష్ట్రలో పత్తి ధరలు పడిపోతే అక్కడి రైతులు ఆదిలాబాద్‌కు వచ్చి అమ్ముకున్నారని ఆయన చెప్పారు. అప్పుడు ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధర లభించేదని ఆయన అన్నారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన అన్నారు. రైతులకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.