TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వేటుఫై స్పీకర్‌ కు జగన్ వర్గం ఎమ్మెల్యేల విజ్ఞప్తి

Published on: Mon Dec 26, 2011 1:44PM

హైదరాబాద్: తమపై మూకుమ్మడి వేటు వేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు సోమవారం శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరుతు  లిఖితపూర్వకంగా వారు విజ్ఞప్తిపత్రం అందజేశారు. తమపై అనర్హత వేటు వేయాలనే కోరుకుంటున్నామని సమావేశానంతరం శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు.అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన శాసనసభ్యులంతా ఒకే మాట మీద ఉన్నారని, తామంతా కలిసికట్టుగా ఉన్నామని ఆయన చెప్పారు. అవిశ్వాసానికి మద్దతుగా నిలిచినందుకు తమకు నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు.

తాము ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, తాము తప్పకుండా గెలుస్తాం కాబట్టి ఉప ఎన్నికలకు వెళ్లడానికి వెనకాడడం లేదని, వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని ఆయన అన్నారు. బంతి వారి కోర్టులోనే ఉందని, తమపై అనర్హత వేటు విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది వారేనని ఆయన అన్నారు. స్పీకర్‌ను కలిసినవారిలో బాలినేని శ్రీనివాస రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, శోభా నాగిరెడ్డి, గుర్నాథ రెడ్డి ఉన్నారు.