TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ రక్షణకు ప్రైవేట్ ఆర్మీ

Published on: Sat Feb 25, 2012 2:54PM

హైదరాబాద్: వైయస్సార్  కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహనరెడ్డి రక్షణకు ఒక ప్రత్యెక ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటుచేయాలని అ పార్టీ నాయకులు యోచిస్తున్నట్లు తెలిసింది. దీనికోసం ప్రైవేట్ సెక్యూరిటి సంస్థలమీద ఆధారపడకుండా ఇప్పటివరకు ఆ  పార్టీకి అంకితభావంతో పనిచేసిన యువకులను గుర్తించి వారితో ఈ ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ ఆర్మీ ఏర్పాటుకోసం ఇప్పటికే కొన్ని జిల్లాల్లో యువకుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనట్లు అ పార్టీకి చెందిన సీనియర్  నాయకుడొకడు తెలుగువన్.కామ్ కు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు ఈ ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటుచేస్తున్నారు. సుమారు వెయ్యిమందితో కూడిన ఈ అర్మిలోని సభ్యలకు వివిధ పరీక్షలు కూడా నిర్వహించి ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు. వీరందరూ బ్యాచ్ ల వారీగా జగన్ వెంట ఉంటారు. కొన్ని బ్యాచ్ లు ముందుగానే జగన్ పర్యటించే ప్రాంతాలకు వెళ్ళి అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.