TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైఎస్ వద్ద పనిచేసిన సిఎఎస్‌లందరినీ విచారించే చాన్స్

Published on: Fri Feb 10, 2012 10:40AM

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పనిచేసిన ప్రధాన కార్యదర్శులందరినీ విచారించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల సిబిఐ రమాకాంత్ రెడ్డిని రెండు రోజుల పాటు విచారించింది. ప్రస్తుతం విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్‌గా ఉన్న మాజీ ప్రధాన కార్యదర్సి ఎ.రఘోత్తమరావును కూడా సిబిఐ విచారణకు పిలిచింది. ఆయనను గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిబిఐ అధికారులు ప్రశ్నించారు. మరో ఐఎఎస్ అధికారి మోహన్ కందాను కూడా విచారణకు రావాలని సిబిఐ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఐదుగురు సీనియర్ ఐఎఎస్ అధికారులు ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. మోహన్ కందా, టికె దివాన్, హరినారాయణ, రఘోత్తమ రావు, రమాకాంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. వైయస్ హయాంలో చివరగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డిని సిబిఐ తొలుత విచారించింది. వైయస్ హయాంలోని భూకేటాయింపులపై సిబిఐ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.