TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్‌ సహనాన్ని పరీక్షించవద్దు:సబ్బం

Published on: Thu Jan 26, 2012 1:38PM

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై ఈగ వాలితే రాష్ట్రంలో ప్రజా తిరుగుబాటు తప్పదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి జోస్యం చెప్పారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎమ్మార్ విల్లా కేసులో సీబీఐ అరెస్టు చేసిన సునీల్ రెడ్డికి, జగన్‌కు ఎలాంటి బంధుత్వం లేదన్నారు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే రాజకీయ పార్టీలు రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్‌ సహనాన్ని పరీక్షించవద్దని ప్రత్యర్థి పార్టీల నేతలకు ఆయన సూచించారు. ఆయనపై ఈగ వాలితే రాష్ట్రంలో ఏ ఒక్కరూ మిగలరని హెచ్చరించారు. జగన్‌ కోసం జనం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని, అందువల్ల ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు. జగన్‌ను ఏ విధంగా అప్రదిష్టపాలు చేయాలన్న అంశంపైనే అధికార పార్టీ నేతలు దృష్టిని కేంద్రీకరించారని విమర్శించారు.