ఫీజు పోరు ధర్నాఫై సిఎం కౌంటర్
Published on: Wed Jan 4, 2012 1:13PM
హై
దరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రకాశం జిల్లా ఒంగోలులో చేపట్టిన ఫీజు పోరు ధర్నాఫై స్పందిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ వేశారు.వైయస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య ప్రభుత్వాల కాలంలోని బకాయిలను కూడా చెల్లించామని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధుల విడుదలలో గత ప్రభుత్వాల కన్నా తన ప్రభుత్వమే మేలుగా వ్యవహరించిందని ఆయన చెప్పారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం తాము రూ. 5,260 కోట్ల రూపాయలు విడుదల చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. ఏ ఏడాది బకాయిలు ఎంతెంత విడుదల చేసింది కూడా ఆ ప్రకటనలో పొందుపరిచారు.ఈ ఏడాది 27 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని ముఖ్యమంత్రి చెప్పారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లించాలంటూ వైయస్సార్ కాంగ్రెసు పా్ర్టీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. ఒంగోలు ధర్నాలో జగన్ పాల్గొన్నారు.


