ఆ ఆరోపణలను ఖండించిన ఎర్రనాయుడు
Published on: Tue Jan 3, 2012 3:57PM
హైద
రాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ అక్రమ ఆస్తుల కేసులో రెండో నిందితుడుగా ఉన్న జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి అరెస్టుపై వైఎస్ఆర్ కాంగ్రెసు నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రంనాయుడు చెప్పారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలను ఎర్రనాయుడు తీవ్రంగా ఖండించారు. అవినీతిపైనే తమ పార్టీ పోరాటం చేస్తుందే కాని వ్యక్తులపైన కాదని ఎర్రన్నాయుడు పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆధ్వర్యంలో జరిగిన అక్రమాలపై ఎనిమిదేళ్ల నుంచి పోరాడుతున్నామని ఎర్రన్నాయుడు ఈ సందర్భంగా గుర్తుచేశారు.


