వైఎస్సార్ భూకేటాయింపులు:నాదెండ్ల సభాసంఘం
Published on: Thu Feb 9, 2012 8:47AM
హై
దరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో జరిగిన భూకేటాయింపులపై శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం సభా సంఘాన్ని నియమించారు. మొత్తం 15 మందితో కూడిన ఈ కమిటీని స్పీకర్ నియమించారు. ఈ కమిటీ ఛైర్మన్‌గా పి. కిష్ణా రెడ్డి ఉంటారు. ఆరు నెలల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపుల్లో, ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్‌లకు) భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ గత శానససభ సమావేశాల్లో ఆరోపిస్తూ ఆ వ్యవహారాలపై సభా సంఘం వేయాలని పట్టుబట్టింది. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ అంగీకారం మేరకు నాదెండ్ల మనోహర్ ఇప్పుడు సభా సంఘాన్ని నియమించారు.


