పెద్ద చేపలెవరో ఐఏఎస్‌లే సీబీఐకి చెప్పాలి
Published on: Mon Feb 6, 2012 1:33PM
హైదరాబాద్: వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అక్రమాలు జరిగి ఉంటే ఆ అక్రమాలకు పాల్పడినవారెవరో నిగ్గు తేల్చేందుకు ఐఏఎస్ అధికారులు ముందుకు రావాలని రాష్ట్ర వైద్యశాఖామంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ హయాంలో కోట్లు మింగిన పెద్ద చేపలెవరో ఐఏఎస్‌లే సీబీఐ ముందు స్పష్టం చేయాలని అన్నారు. ఐఏఎస్‌లు తప్పు చేయనప్పుడు బాధపడటం దేనికని ప్రశ్నించారు. అలాగే ఒక వ్యక్తి స్వార్థం వల్లనే గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థ నాశనమైందని జగన్‌ను ఉద్దేశించి డీఎల్ అన్నారు.
ఇంకా మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి మాట్లాడుతూ... జూడాలు మొండిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పైగా జూడాల సమ్మెవిరమిస్తే చర్చలకు ఆహ్వానిస్తామని డీఎల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తమ డిమాండ్ల సాధన కోసం జూడాలు సోమవారం మంత్రి శైలజానాథ్‌తో సమావేశమయ్యారు. ఇప్పటికే రెండు దఫాలుగా జూడాలతో చర్చలు ముగిశాయి. చివరి దఫా చర్చలు సోమవారం సాయంత్రం జరుగనున్నట్లు తెలిసింది.


