సునీల్ రెడ్డికి నాకు రిలేషన్ ఏమిటి? జగన్
Published on: Wed Jan 25, 2012 1:21PM
గుంటూరు:
తనను ఇబ్బందులు పెట్టడానికి, వైయస్ రాజశేఖర రెడ్డిపై బురద చల్లడానికి సిబిఐ అమాయకులను కూడా పావులుగా వాడుకుంటోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విమర్శించారు. అయన గుంటూరు జిల్లాలో తన ఓదార్పు యాత్రను కొనసాగిస్తున్నారు. గురజాల ముస్లిం సెంటర్‌లో ఆయన ప్రసంగించారు.ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో అరెస్టయిన సునీల్ రెడ్డి తనకు ఎలా బంధవు అవుతాడో చెప్పాలని అడిగారు. ఆ విషయం సిబిఐవాళ్లే చెప్పాలని ఆయన అన్నారు.పులివెందులకు చెందినవాళ్ళు రెడ్డి అయితే చాలు, ఏదో ఒక విధంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు.సునిల్‌రెడ్డిపై సిబిఐ అభాండాలు వేస్తోందని వెల్లడించారు.ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడున నారా చంద్రబాబు నాయుడిని కాపాడుతూ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని బాధ్యుడ్ని చేసే ఉద్దేశంతో కాంగ్రెసు, తెలుగుదేశం, సిబిఐ కుట్రలు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చూస్తుంటే బాధనిపిస్తోందని ఆయన అన్నారు. సునీల్ రెడ్డి అరెస్టు వార్త విన్నప్పటి నుంచి వైయస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.


