TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ పార్టీపరంగా బద్ధవ్యతిరేకి:కిరణ్

Published on: Tue Jan 24, 2012 2:09PM

హైదరాబాద్: వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్లిపోయాడని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బయటకెళ్లి పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని అంటున్నారనీ, అటువంటి జగన్ ను వైఎస్సార్ కుమారునిగా గౌరవించాలి తప్పితే పార్టీపరంగా బద్ధవ్యతిరేకిగా చూడాలన్నారు.జగన్ తండ్రి వైఎస్సార్ తన జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే, జగన్ మాత్రం ఆయన ఆశయాలకు తూట్లు పొడిచి స్వార్థంతో బయటకు వెళ్లిపోయారని అన్నారు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ అయిన చంద్రబాబు తెలుగుదేశం ఎంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతేనని అన్నారు.