TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైఎస్ఆర్ పై వ్యాఖ్యలకు చంద్రబాబు వివరణ

Published on: Sat Jan 21, 2012 3:00PM

హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని తాను అడవి పందిగా తిట్టలేదని ఆయన శనివారం స్పష్టం చేశారు. పంటను అడవి పంది నాశనం చేసిన విధంగా రాష్ట్రాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి నాశనం చేశారని తాను అన్నట్లు ఆయన తెలిపారు. తాను వైయస్ రాజశేఖర రెడ్డిని దూషించలేదని అన్నారు. రాష్ట్రాన్ని ఎవరూ నష్టపరచనంతగా వైయస్ రాజశేఖర రెడ్డి నష్టపరిచారని, వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. రాష్ట్రాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి అభివృద్ధిలో 20, 30 ఏళ్లు వెనక్కి తీసుకునివెళ్లారని విమర్శించారు. తన పోరాటం వ్యక్తులపై కాదని, తన పోరాటం ప్రజావ్యతిరేక విధానాలపైనే అని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో కుమ్మక్కయ్యారని ఆయన అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలవరం టెండర్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కుమ్మక్కయ్యారని విమర్శించారు. రెండేళ్లు కూడా పార్టీని నడపలేదని చిరంజీవి ప్రజలకు ఎలా సేవ చేయగలరని ఆయన అన్నారు. పన్నుల రూపంలో ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతోందని ఆయన అన్నారు.