TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లక్ష కోట్లు కొల్లగొట్టిన వైఎస్సార్ కు లక్ష విగ్రహాలా ?

Published on: Sat Jan 21, 2012 9:12AM

హైదరాబాద్: పొలంలో అడవి పందులు పడి పంటనంతా రచ్చరచ్చ చేసి నాశనం చేసినట్లు వైఎస్సార్ రాష్ట్రంలోని సంపదనంతా దోచేసి ఆయన కుమారుడికి, బంధువులు, మిత్రులకు పంచేశాడని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు  రైతుపోరు బాటలో వైఎస్సార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలా లక్ష కోట్లు కొల్లగొట్టిన వైఎస్సార్ విగ్రహాలను లక్ష ప్రతిష్టింపజేస్తారా..? అని ప్రశ్నించారు.రాష్ట్రంలో మహానుభావులు, స్వాతంత్ర్యం తెచ్చిన జాతిపిత విగ్రహాలు లేవు, అంబేద్కర్ విగ్రహాలు కనబడవు, కానీ గల్లీగల్లీకి  వైఎస్సార్ విగ్రహాలు మాత్రం వెలుస్తున్నాయి. అధికారంలోకి వస్తే ఆ విగ్రహాలను కూలగొడతానంటూ చంద్రబాబు అన్నారు.

వైఎస్సార్ విగ్రహాలను కూలగొడతానని అన్నప్పుడు పెద్దగా స్పందించని కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ ను అడవి పందితో పోల్చుతూ లక్ష కోట్లు మింగేశాడని ఆరోపణలు చేయగానే బుసలు కొట్టారు. రెవిన్యూ మంత్రి రఘువీరా అయితే కుప్పంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా ఆపుతారా అంటూ సవాల్ విసిరారు.ఇక వైఎస్సార్ కాంగ్రెస్ నేతలైతే.. వైఎస్ విగ్రహాలపై చేతులేస్తే చేతులు తెగనరుకుతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇలా మొత్తమ్మీద  వైఎస్ విగ్రహాల చుట్టూనే నేతల మాటల దాడి జరిగింది. ఇంతకీ వైఎస్ విగ్రహాలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తాయో లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభాన్ని తెచ్చిపెడతాయో చూడాలి.