TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైఎస్ఆర్ పై చంద్రబాబు ఆరోపణ

Published on: Wed Jan 18, 2012 3:54PM

హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి తెలిసే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో దోపిడీకి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆరోపించారు. రసూల్‌పురాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు వారి గుండెల్లో ఉన్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టే వరకు పోరాటం చేస్తామన్నారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచానికి చాటితే కాంగ్రెసు నేతలు మాత్రం ఢిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తాము కృషి చేస్తామన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారం కోసమే పుట్టిన పార్టీ అన్నారు. అధికారంలోకి రాగానే శంషాబాద్ ఎయిర్ పోర్టు పేరును ఎన్టీఆర్ పేరు మీద మారుస్తామన్నారు. ముందుంది మరింత మంచి కాలం అంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరెంత కాలం ఉంటాడో చెప్పలేమన్నారు. పోలవరం టెండర్లను రాజాంకు కట్టబెట్టేందుకు సిఎం ప్రయత్నించారన్నారు.