TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్వల్పవిరామంతో జగన్ ఓదార్పుయాత్ర

Published on: Mon Jan 9, 2012 8:10AM

గుంటూరు:గుంటూరు జిల్లాలో మూడో విడత ఓదార్పు యాత్ర ఆదివారంతో ముగిసింది. జిల్లాలో మూడు విడతల్లో 48 రోజులపాటు పర్యటించిన జగన్ దాదాపు 8 నియోజకవర్గాల్లో యాత్ర పూర్తిచేశారు. ఆదివారం రాత్రి అబ్బురాజుపాలెంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేయడంతో మూడో విడత యాత్ర ముగిసింది. జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్రకు స్వల్ప విరామం ప్రకటించినట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, తలశిల రఘురాంలు మీడియాకు తెలిపారు.నిజమాబాద్ జిల్లా ఆర్మూర్‌లో తలపెట్టనున్న రైతు దీక్ష దీక్షను పురస్కరించుకొని ఓదార్పుయాత్రకు విరామం ప్రకటించారు. జనవరి 17 తేదిన జగన్ ఓదార్పుయాత్రను తిరిగి ప్రారంభిస్తారని రాజశేఖర్,రఘురాంలు తెలిపారు.