TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

యలహంక ఆస్తి భారతి తల్లిది.. షర్మిలకు హక్కులు లేవా.?

Published on: Tue Nov 24, 2026 8:15AM

జగన్  ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య నెలకొన్న ఆస్తుల వివాదం రోజుకో కొత్త మలుపు ఇటు రాజకీయవర్గాలలోనూ, అటు వైఎస్ అభిమానుల్లోనూ  చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బెంగళూరులోని యలహంక నివాసానికి సంబంధించిన వ్యవహారంలో వైఎస్ జగన్ అనుసరించిన వైఖరి, ముందుకు తెచ్చిన డాక్యుమెంటేషన్ వాదనలు ఈ వివాదానికి  కొత్త కోణాన్ని జోడించాయి. షర్మిల తన కుమార్తె వివాహ వేడుకలకు సంబంధించిన అంశాల నేపథ్యంలో  , యలహంక నివాసంలోకి ఆమె ప్రవేశించకుండా న్యాయపరమైన చర్యల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు   ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ జగన్ తరఫున వినిపిస్తున్న ప్రధాన వాదన యలహంక ఆస్తి యాజమాన్య హక్కుల చుట్టూ తిరుగుతోంది. ఈ నివాసం వైఎస్ భారతి తల్లి పేరిట ఉందనీ.. ఆ ఆస్తిని తన కంపెనీకి లీజుకు తీసుకున్నట్లు జగన్ చెబుతున్నారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు,  లీజు అగ్రిమెంట్లు ఆయన  వాదనకు బలం చేకూరుస్తున్నాయి, అందువల్ల ఈ ఆస్తిపై షర్మిలకు ఎటువంటి హక్కులు లేవని న్యాయస్థానంలో జగన్ వాదనలు వినిపించే స్థాయికి వివాదం చేరింది.  ఇప్పటి వరకూ యలహంక ఆస్తి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి  ఆస్తులలో ఒకటిగా ప్రచారంలో ఉన్నప్పటికీ, వాస్తవ పత్రాల ప్రకారం అది భారతి తల్లికి చెందినదని, ఆపై తమ సంస్థ  లీజుకు తీసుకుందని జగన్ గట్టిగా వాదిస్తున్నారు.  

ఇక్కడే వైఎస్ జగన్  వ్యూహాత్మకంగా వ్యవహరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   యలహంక ప్యాలెస్ తమ  కుటుంబ ఆస్తి కాదనీ, భారతి తల్లి పేరు మీద ఉన్న ఆస్తి తమ కంపెనీ లీజులో ఉందనే అంశాన్ని ముందు పెట్టడం ద్వారా న్యాయపరంగానూ, రాజకీయంగానూ జగన్ పైచేయి సాధించినట్లు పరిశీలకులు అంటున్నారు.  దీంతో ఆస్తిపై హక్కు కోరుతున్న షర్మిలే ఇది తమ కుటుంబ ఆస్తి అని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.  తనకు ఆ ఆస్తిపై హక్కు ఉందని షర్మిల నిరూపించుకోవాలంటే, ఆస్తి మూల యాజమాన్యం  నిధుల సమీకరణకు సంబంధించిన   ఆధారాలను సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ఈ పరిణామాలపై   జగన్ రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గతంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సందర్భంలో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తావించిన బెంగళూరు ఆస్తుల అంశాన్ని గుర్తుచేస్తూ, యలహంక ఆస్తిని కూడా వైఎస్ఆర్ హయాంలో భారతి తల్లి పేరు మీద కొనుగోలు చేశారా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది బినామీ వ్యవహారమా అనే ఊహాగానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే, యలహంక ఆస్తి బినామీదేనని ఇప్పటివరకు ఎటువంటి అధికారిక నిర్ధారణ లేదా తీర్పు వెలువడలేదన్నది గమనార్హం.

వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకం,రాజకీయ విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ వ్యవహారం   ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ఆర్ వారసత్వం, కుటుంబ ఆస్తులపై ఇద్దరి మధ్య నెలకొన్న అగాధం బయటపడటంతో, ప్రతి చిన్న పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఒకప్పుడు అన్నాచెల్లెళ్లుగా కలిసిమెలిసి ఉన్న జగన్, షర్మిల మధ్య ఆస్తుల అంశం ఇంతటి న్యాయపరమైన పోరాటానికి దారితీయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుత పరిణామాల దృష్ట్యా షర్మిల  యలహంక ఆస్తి యాజమాన్య పత్రాలను ఆమె సవాలు చేస్తే, గతంలో తమ తండ్రి వైఎస్ఆర్ ఆస్తుల కొనుగోళ్లు, వాటి వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, బినామీ కోణాలపై కొత్త చర్చలు తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. అలా కాకుండా ఆమె ప్రస్తుత రిజిస్టర్డ్ యాజమాన్య స్థితిని అంగీకరిస్తే..  ఆ ఆస్తిపై తనకున్న దావా బలహీనపడే అవకాశం ఉంది. అంతేకాకుండా, జగన్ అత్తగారికి చెందిన ఆస్తిలో  వాటా కోరుతున్నారనే  అపప్రధను కూడా మూటగట్టుకునే ప్రమాదం ఉంది. ఇది వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ కూడా ఆమెకు ఇబ్బందికలిగిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

ఇది కూడా చదవండి:  యలహంక ప్యాలెస్ విషయంలో: జగన్ చట్టపరంగా పై చేయి.. నైతికంగా ఘోర పరాజయం.!


న్యాయస్థానంలో ఈ ఆస్తి వివాదానికి సంబంధించిన తదుపరి విచారణలు, వాదనలు ఎలా సాగుతాయనే  ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.  కేవలం లీజు,  యాజమాన్య పత్రాల ఆధారంగా జగన్ వేసిన ఎత్తుగడ కోర్టులో ఏ మేరకు నిలబడుతుందనేది న్యాయ నిపుణులు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు, ఈ న్యాయపరమైన చిక్కుముడిని అధిగమించేందుకు షర్మిల ఎలాంటి న్యాయపరమైన లేదా రాజకీయ వ్యూహంతో ముందుకు వస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

రానున్న రోజుల్లో ఈ ఆస్తి వివాదం మరిన్ని కీలక పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ ఆస్తుల వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున, ఇరువర్గాలు సమర్పించే పత్రాలు, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానం ఇచ్చే ఉత్తర్వులు ఈ వ్యవహారానికి కీలకంగా మారనున్నాయి.  ఆసక్తికరంగా, ఆ ఆస్తిని దివంగత వైఎస్ఆర్‌కు చెందిన ఆస్తులలో ఒకటిగా ఇప్పటి వరకూ చూపుతూ వస్తున్నారు.  అయితే.. జగన్, భారతి కుటుంబాలకు చెందిన ఆస్తులపై షర్మిల హక్కులు కోరడానికి ప్రయత్నిస్తున్నారని ఇప్పుడు వైసీపీ అంటోది. ఇక్కడే జగన్ చాలా చాలా తెలివిగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. 

జగన్ ప్రత్యర్థులు మాత్రం మరో కోణాన్ని తెరపైకి తెస్తున్నారు. జగన్‌కు చెందిన అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలో బెంగళూరు ఆస్తులను ప్రస్తావించిన విషయాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తొలుత   యలహంక ఆస్తిని భారతి తల్లి పేరు మీద కొనుగోలు చేశారా లేదా అని  వారు ప్రశ్నిస్తున్నారు.ఇది బినామీ ఒప్పందం జరిగి ఉండవచ్చనే ఊహాగానాలకు కూడా దారితీసింది. అయితే, యలహంక ఆస్తి బినామీ అని నిరూపించడానికి ఎటువంటి నిర్ధారిత ఆధారం లేదు.ఇప్పుడు  సవాలు షర్మిల ముందుంది. ఆ ఆస్తి నిజానికి తన తండ్రిదేనని ఆమె నిరూపించుకోవాలంటే, దాని అసలు యాజమాన్యం,  నిధుల మూలం గురించి ఆమె ఆధారాలు  చూపాల్సి ఉంటుంది. 

ఒకవేళ ఆమె వాదనలో బినామీ ఒప్పందం ఉందనే ఆరోపణ ఉంటే, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ఆస్తిని ఎలా సంపాదించారు, వేరొకరి పేరు మీద ఎందుకు రిజిస్టర్ చేయించారు అనే విషయాలు చర్చకు దారితీస్తాయి అయితే, అటువంటి ఒప్పందాన్ని నిరూపించినంత మాత్రాన ఆ డబ్బు అక్రమంగా సంపాదించిందని దానంతట అదే రుజువు కాదు.ఇక్కడే జగన్ పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. రిజిస్టర్  అయిన యాజమాన్యంపై ఆధారపడటం ద్వారా, ఆ వాదనను సవాలు చేసే భారాన్ని ఆయన షర్మిల మీదకు నెట్టారు. అదే సమయంలో, ఆయన అత్తమామల ఆస్తిలో ఆమె వాటా కోరుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపించే పరిస్థితి ఉంది,   యాజమాన్యాన్ని సవాలు చేయడం ఆమె తండ్రి ఆస్తుల గురించి మరిన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలకు దారితీపే అవకాశం ఉంది,, అదే సమయంలో ప్రస్తుత యాజమాన్య స్థితిని అంగీకరించడం ఆస్తిపై ఆమెకున్న హక్కును బలహీనపరుస్తుంది.జగన్   న్యాయపరమైన వాదన చివరికి విజయం సాధిస్తుందో లేదో  అన్నది వేరే సంతి కానీ, ఇక్కడ ఆయన వ్యూహాత్మకంగా కోర్టుకు వెళ్లడడం ద్వారా షర్మిలను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేశారని చెప్పాలి.  

మీకు నచ్చవచ్చు: ఇంత కంటే నీచం ఉంటుందా: ఇంత దిగజారుడుతనమా.. జగన్ పై షర్మిల ఫైర్.!

షర్మిల కుమార్తె వివాహం.. జగన్ యూరప్ టూర్ లింకేంటి?

[YSBharatiReddy, YSSharmila, YSJagan, Yelahankadispute, YSfamilyassets, TeluguOne]