వైయస్‌ విజయమ్మ దీక్ష భగ్నం

 

రాష్ట్రవిభజన విషయంలో కాంగ్రెస్‌ వైఖరిని నిరసిస్తూ దీక్ష చేపట్టిన వైయస్‌ఆర్‌ సిపి గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ చేస్తున్న ఆమరణ నిరహారదీక్షను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు.

ఐదురోజులుగా దీక్ష చేస్తుండటంతో ఆమె ప్రాణానికి ప్రమాదం అన్న కారణంతో పోలీసులు బలవంతంగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీంతో అర్ధరాత్రి దీక్షా శిభిరం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శిభిరంలోనే ఉన్న వైసిపి నేతలు వైవీ సుబ్బారెడ్డి, వాసిరెడ్డి పద్మ, శోభానాగిరెడ్డి సహా పార్టీ నేతలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

వేదిక వీద ఉన్న నేతలందరిని పంపించేసిన పోలీసులు రాత్రి 1.55గంటలకు పోలీస్‌ వ్యాన్‌లోనే విజయమ్మను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో పలువురు నేతలకు గాయాలయ్యాయి. పోలీస్‌ వైఖరిని నిరసిస్తూ విజయమ్మ ఆసుపత్రి ముందు రోడ్డు పై బైటాయించి నిరసన తెలిపారు. తరువాత డాక్టర్లు ఆమెను ఐసియూకి తరలించారు.

విజయమ్మ నిరసన దీక్షను భగ్నం చేయడంతో పాటు పోలీసులు వైసిపి నాయకులనూ అమానుషంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ రోజు సీమాంద్ర బంద్‌కు పిలుపునిచ్చింది.