TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టి.ఆర్‌.ఎస్‌. సిరిసిల్ల లొల్లి

Published on: Mon Jul 23, 2012 9:12AM

వైఎస్సార్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 23న చేనేత కార్మికుల కొరకు జరపతలపెట్టిన సిరిసిల్ల పర్యటనపై టిఆర్‌ఎస్‌ కండిషన్లు పెట్టింది. వైఎస్సార్ సిపి పార్టీ తెలంగాణాకు అనుకూలంగా ఉంటామని, రాసి సంతకం పెట్టి రాష్ట్రపతికి ఇవ్వాలని లేకపోతే ఆమె పర్యటనను అడ్డు కంటామని టిఆర్‌యస్‌ నాయకులు, తెలంగాణా జెఎసి కోదండరామ్‌ హెచ్చరిస్తున్నారు. అయితే దీనిపై వైఎస్సార్ సిపి నాయకత్వం హైకోర్టుకు వెళ్ళి అనుమతిని పొందింది. దీనివల్ల వైఎస్సార్ సిపి కార్యక్రమాలను సిరిసిల్లలో ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 5 గంటలవరకు అంబేద్కర్‌ సెంటర్లో నిర్వహించుకోవచ్చు. హైకోర్టు తీర్పుతో ఖంగుతిన్న టిఆర్‌ యస్‌ నాయకులు, టి జాక్‌ నేతలు అదే రోజు బంద్‌ ప్రకటించారు. ఆరు నెలల క్రితం వైఎస్సార్ సిపి నేత జగన్‌ తెలంగాణలోని రైతులకు మద్దతు తెలుపుతూ ధర్నా చేస్తే పట్టించుకోని టి ఆర్‌యస్‌ ఇప్పడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలియటం లేదని తెలంగాణ వైఎస్సార్ సిపి నేతలు ఆరోపిస్తున్నారు.

 

పరకాలలో కొండ సురేఖ గట్టిపోటీ ఇవ్వడంతో తెలంగాణలో వైఎస్సార్ సిపి నాయకులను తిరగతివ్వడం శ్రేయస్కరం కాదని తెలుసుకున్న తెలంగాణ నాయకులు వీరిని అడ్డుకుంటున్నారని తెలుస్తుంది. ప్రస్తుత పరిస్దితుల్లో సిరిసిల్ల ప్రాంతంలో గంటగంటకు రాజకీయ సమీకరణాలు మారుతూ టెన్షెన్‌ టెన్షన్‌గా ఉంది. కార్యక్రమాన్ని భగ్నం చేయాలని టిఆర్‌ఎస్‌, దర్నాని సక్సెస్‌ చేయాలని వైఎస్సార్ సిపి నాయకత్వం, ఇలా ఈ రెండు పార్టీలకు సిరిసిల్ల ప్రిస్టేజ్‌ ఇష్యూగా మారింది. ప్రాంతీయ విభేధాలను సృష్టించి పబ్బం గడుపుకుంటున్న టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రాంతీయతత్వ భావోద్వేగాలను రెచ్చగొట్టటం మినహా ఆప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చేసింది శూన్యం. ఇంగ్లాండు రాణికి అగ్గిపెట్టెలో పట్టే పల్చటి చీరను బహుమతిగా ఇచ్చి ఈ దేశపు వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన చేనేత కార్మికులను సొంత రాష్ట్రంలో పట్టించుకునే నాయకులులేక, పరిస్థితులు అనుకూలించక, ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో పార్టీలకతీతంగా ఆపన్న హస్తాన్ని అందించవలసిన రాజకీయ పార్టీలు గందరగోళం చేయడం అమానుషం.

 

ఇది కేవలం తెలంగాణ రాష్ట్రనేతలు తమ ఉనికిని కోల్పోతామన్న భయంతో చేస్తున్న బంద్‌ మాత్రమేనని తెలుస్తుంది. చేనేత కార్మికుల కులంగా చెప్పుకునే పద్మశాలీలకు ప్రస్తుత ప్రభుత్వం చేసిందేమీ లేదనే చెప్పవచ్చు. పద్మశాలీలకు వైయస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్‌ సబ్సిడీ, పావలావడ్డీకి రుణాలు, ఆత్మహత్యలు చేసుకున్నకుటుంబాలకు లక్ష రూపాయల ఎక్సెగ్రేషియా, నేతన్నకుటుంబానికి ఇచ్చిన 50 వేల రూపాయల రుణం( అందుకోసం అప్పుడు దాదాపు 100 కోట్లు కెటాయించడం జరిగింది.)అమలు చేశారు. అయితే ప్రస్తుత పాలనలో ఇవేమీ అమలు జరగక పోవడంతో చేనేత కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ సమయంలో వైఎస్సార్ సిపి గౌరవాద్యక్షురాలైన విజయమ్మ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

 

సిరిసిల్ల విషయమై తెలుగుదేశం పార్టీ అడ్డుచెప్పబోమని తెలిపింది. చేనేత కార్మిక కుటుంబాలు విజయమ్మ పర్యటనను స్వాగతిస్తుండగా తెలంగాణ జెఎసి దీనిపై దూమారం లేపుతుంది. నిజానికి ఏ పద్మశాలి కుటుంబం నుండి టిఆర్‌యస్‌ కు మద్దతు లేదనే తెలుస్తుంది. ఇంతవరకు ఒక్క నేత కూడా ఈ సామాజిక వర్గంనుండి టిఆర్‌ఎస్‌కు నాయకుడిగా ఎన్నిక కాలేదు సరి కదా ఈ వర్గానికి చెందిన నాయకులను మూడు చోట్ల అసెంబ్లీకి వెళ్ళకుండా టిఆర్‌ఎస్‌ ఓడించడం జరిగింది. దీంతో నేతకుటుంబాలు సహజంగానే మిగతా పార్టీలకు మద్దతు తెలుపుతున్నారు.