TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మా ఇంటికి రావొద్దు.. షర్మిలకు దిమ్మతిరిగే షాక్! 

Published on: Mon Aug 23, 2021 7:23PM

వైఎస్సార్ టీపీ తెలంగాణ అధినేత్రి షర్మిలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ రాజీనామాతో  కుదేలైన వైఎస్ షర్మిలకు మరో  ఊహించని షాక్ తగిలింది. నిరుద్యోగుల కుటుంబాలకు మద్దతుగా పోరాడుతున్న ఆమెకు.. ఓ నిరుద్యోగి కుటుంబం నుంచే ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షల్లో భాగంగా ఈ నెల 24న మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టాలని షర్మిల నిర్ణయించారు. అయితే దీక్ష ముందు రోజే దీక్ష కోసం తమ ఇంటికి రావొద్దంటూ నిరుద్యోగి నరేష్‌ తండ్రి.. వైఎస్ షర్మిలకు విజ్ఞప్తి చేయడం కలకలం రేపుతోంది. 

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన నరేష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. నరేష్ ముగ్గురు అన్నలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. నరేష్‌కు ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయం చేస్తూ తన తండ్రికి చేదోడుగా ఉన్నాడు. తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతి మంగళవారం చేస్తున్న నిరుద్యోగ దీక్షలో భాగంగా.. లింగాపూర్‌కు చెందిన నరేష్ ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేశారు. అందుకోసం  పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. నరేష్ తండ్రి నిర్ణయంతో వైసీపీ నేతలంతా ఆలోచనలో పడ్డారు. 

గత మంగళవారం మహబూబాబాద్‌ నియోజకవర్గంలోని గూడూరు మండలం గుండెంగ గ్రామంలో షర్మిల దీక్ష చేశారు. గ్రామ సమీపంలోని సోమ్లా తండాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి బోడ సునీల్‌ నాయక్‌ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.