TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైయస్‌ ఫోటో వుండాలి, అక్కర్లేదు

Published on: Thu Aug 2, 2012 2:09PM

మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి ప్రమాణ స్వీకరణ సందర్బంగా జరిగిన కార్యక్రమం వల్ల రాష్ట్ర కాంగ్రెస్‌లో మూడు రకాలయిన నాయకులు ఉన్నారని తెలుస్తుంది. ఒక వర్గం అంతా దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌ అనుయాయులని,  దానికి పూర్తి వ్యతిరేకంగా రాష్ట్రంలో వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తులే వుండకూడదనుకునే వర్గం రెండోది.


మూడోది ఎవరైతే ఎంటి అనుకునే వర్గం. నిన్న జరిగిన యువజన నేత ప్రమాణ స్వీకార సభలో ప్రసంగించిన కెవిపి  గాంధీ భవన్‌లో వైయస్‌ రాజశేఖర్‌ చిత్రపటం లేకపోవటం పట్ల తీవ్ర  అవేదన వ్యక్తం చేసారు. అంతకుముందు గాంధీ భవన్‌లో జరిగిన మౌన దీక్షలో వి.హనుమంతరావు కాంగ్రెస్‌పార్టీలో వైయస్‌ అనునాయులను కోవర్టులతో పోలుస్తూ వారిని ఏరివేయాలని అన్నారు.



ఇదే గంధీభవన్‌లో కెవిపి తర్వాత మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి రాజనర్శింహ మాట్లాడుతూ అంజయ్య అయినా, వైయస్‌ అయినా ఒకటేనని వైయస్‌ ఫోటో పెట్టేటట్లయితే అంజయ్య ఫోటోకూడా పెట్టాలని అన్నారు. అదే కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ ఈ విషయం గూర్చి ఏమాత్రం ప్రస్తావించకుండా వ్యాపారం చేసుకొని రాజకీయాల్లో ఖర్చుపెట్టేవాళ్లు రావాలని అంతే గాని రాజకీయాలను బిజినెస్‌ గా చూడకూడదని సెలవిచ్చారు. రాజకీయాలు ఇలాగే వుంటాయి మరి.