పాదయాత్ర ముహూర్తం జగన్ని ముంచుతుందా..?

2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జగన్ చేయని ప్రయత్నం లేదు..  విమర్శలు , వ్యూహాలు ఒకటా రెండా ?  ఏవి జనాలలో అతని చరిష్మాని పెంచలేదు . దాంతో  తను తన పరివారం ఏమి చేసినా తెలుగుదేశం హవా ఆపలేకపోతున్నాం అని భావించి  ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్‌ను రంగం లోకి దింపాడు . కానీ  నంద్యాల ఎన్నికలతో ప్రశాంత్ సీన్ అర్థమైపోయింది. 

 

దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వున్న జగన్ కి ఎవరు ఇచ్చారో గాని సలహా, పాదయాత్ర మొదలు పెట్టాడు.. ఒకప్పుడు తన తండ్రి కి అధికారం కట్ట బెట్టింది ఆ పాద యాత్రే కాబట్టి , ఇప్పుడు తనకి కూడా అది కలసి వస్తుంది అనుకున్నాడో ఏమో తన కాళ్ళకి పని చెప్పాడు . 

 

ఈ నెల 6వ తేదీన ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నుంచి పాదయాత్రను ప్రారంభించాడు. అయితే జగన్ ఏ ముహూర్తాన్న పాదం కదిపాడో గాని సమస్యలు ఒకటొకటి గా అతనిని చుట్టుముట్టడం మొదలు పెట్టాయి . మొదటి రోజే ప్యారడైజ్ పేపర్లతో  జగన్ పేరు మారుమోగింది . అంతేనా రెండో రోజు కి నడుముకి బెల్ట్ తో కనిపించాడు. ఇంకేంటి ? సోషల్ మీడియా జగన్ ని టార్గెట్ చేసి వార్తలు రాసేసింది.

 

ఇంకెంత కాలం ఇతని పాద యాత్ర సాగాదంటూ కొంతమంది జోకులు వేయటం మొదలు పెట్టారు కూడా . తెలుగుదేశం అనుకూల శ్రేణులు కూడా  సోషల్ మీడియా లో జగన్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. పాదయాత్ర తో జనాలలో పేరు తెచ్చు కుందామనుకుంటే వున్న పేరు పోయి అభాసుపాలు అయ్యేటట్టు వుంది . దీనికంతటికి కారణం ఏంటయ్యా అని కొందరు వైకాపా అభిమానులు   పండితులు ను కలసి ఆరా తీసారుట. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జాతకం.. ప్రస్తుతం జరుగుతున్న దశ, అంతర్దశలను పరిశీలిస్తే అతను పాదయాత్ర ప్రారంభించిన  ముహూర్తం ఏమంత బలంగా లేదంటున్నారు పండితులు. 
మరి పరిష్కారం ఏంటి అంటే ?  జగన్ ఈ యాత్ర జరిగినంత కాలం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని,.. 

 

సీఎం చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా విమర్శించటం మీద కంటే .  ప్రజల .. సమస్యలపైనే ద్రుష్టి పెడితే మంచిదని సూచిస్తున్నారు .. అంతేకాదు..టైం బాలేదు కాబట్టి అనేక సమస్యలు చుట్టు ముట్టే అవకాసం వుంది కాబట్టి జాగ్రత్త గా వుండాలి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నారు .. మరి జగన్ యోదుడిలా పోరాడుతాడా ? వెనక్కి తిరిగుతాడా ? కాలమే నిర్ణయించాలి .