రాయలసీమకు వీడ్కోలు పలికిన జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొద్దిరోజులుగా చేస్తోన్న ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. శ్రీకాళహస్తికి సమీపంలోని పెళ్లకూరు మండలం పునబాక వద్ద ఇవాళ ఉదయం జగన్ నెల్లూరు జిల్లాలో పాదం మోపారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా నేతలు, ప్రజల నుంచి జగన్‌కు ఘనస్వాగతం లభించింది. నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ నుంచి ప్రారంభమైన యాత్ర కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 900 కిలోమీటర్లకు పైగా సాగింది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ జగన్ తన యాత్రను కొనసాగిస్తున్నారు.