హైదరాబాద్ వచ్చి రాగానే..దాసరికి జగన్ నివాళులు
Published on: Sun Jun 11, 2017 3:59PM
.jpg)
దిగ్జజ సినీ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావుకు ఘన నివాళులర్పించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్. దాసరి మరణించినప్పుడు జగన్ విదేశాల్లో ఉండటంతో ఆయనను కడసారి చూడలేకపోయారు జగన్. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ ఇమేజ్ గార్డెన్స్‌లో జరిగిన దాసరి సంస్మరణ సభకు జగన్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న దాసరి విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు.


