నాన్న దీవెనలు.. జగన్ సీఎం అవుతాడు.!!

తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం పసలపూడిలో తన తండ్రి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 69వ జయంతి వేడుకల్లో పాల్గొన్న జగన్.. వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు.. ఈ సందర్బంగా మాట్లాడిన జగన్.. ప్రజల ఆశీస్సులు, నాన్న దీవెనలే తనను నడిపిస్తున్నాయని అన్నారు.. ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేసున్న సంగతి తెలిసిందే.. ఈ పాదయాత్ర మండపేట నియోజకవర్గం చేరేసరికి 2500 కిలోమీటర్లకు చేరుకుంది.. గతంలో చంద్రబాబు చేపట్టిన ‘మీ కోసం వస్తున్నా’ పాదయాత్ర కూడా ఇదే నియోజకవర్గంలో 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవడం విశేషం.. మరోవైపు వైఎస్ జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించిన వైఎస్‌ సతీమణి విజయలక్ష్మి మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుంది, జగన్‌బాబు ముఖ్యమంత్రి అవుతాడు. తండ్రి మాదిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తాడు' అని అన్నారు.