నెల్లూర్ లో రైతు భరోసాను ప్రారంభించనున్న జగన్, అదే జిల్లాలో చంద్రబాబు పర్యటన...

 

ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతి పక్షనేత చంద్రబాబు ఈ రోజు నెల్లూరులోనే పర్యటించబోతున్నారు. నిన్ననే నగరానికి వచ్చిన చంద్రబాబు ఈ రోజు కూడా జిల్లా పార్టీ సమీక్ష కార్యక్రమంలో పాల్గొంటారు. మరికాసేపట్లో నగరానికి రానున్న ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ ఒక్క రోజే సీఎం జగన్మోన్ రెడ్డి, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా పర్యటిస్తున్నారు. 

తొలి రోజు పర్యటనలో జిల్లా నేతలతో సమావేశమైనటువంటి చంద్రబాబు, రెండో రోజు కూడా ఇవాళ ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల నేతలందరితో కూడా సమావేశం అవుతారు. అలాగే ఎన్నికలైన తర్వాత తొలిసారిగా జిల్లా వచ్చినటువంటి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో పది నియోజక వర్గాల్లో కూడా పూర్తిగా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా ఓటమి చెందిన తరువాత పార్టీలో నేతలందరితో కూడా సమీక్ష నిర్వహించారు. అలాగే ఇటీవల టిడిపి నేతలపై దాడులు జరుగుతున్నాయి. దాడుల నుంచి కార్యకర్తలను కాపాడుకునేందుకు తాను ముందుంటానని భరోసా ఇఛ్ఛేటువంటి కార్యక్రమంలో భాగంగా జిల్లాల పర్యటనలు చేసినటువంటి చంద్రబాబు నిన్న నెల్లూరు జిల్లాకు వచ్చారు. నిన్న ఐదు నియోజక వర్గాల సమీక్ష నిర్వహించారు. ఇవాళ మిగిలినటువంటి ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలో పాల్గొంటారు. 

ఇక ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈ ఉదయం పదకొండు గంటలకు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కార్యక్రమాన్ని ఇక్కడ్నుంచే ప్రారంభిస్తారు.నవరత్నాల్లో భాగంగా ఇప్పటికే కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క జిల్లా నుంచి ప్రారంభిస్తూ వస్తున్నటువంటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లా కాకుటూరులో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే పన్నెండు వేల ఐదు వందల ఏడాదికి ఇస్తానని ప్రకటించిన అటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భరోసా సాయాన్ని మరొక వేయ్యి రూపాయలు కూడా పెంచింది. పదమూడు వేల ఐదు వందల వరకు కూడా సాయమిస్తానంటూ ప్రకటించినటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది.దీని కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇవాళ మధ్యాహ్నం మూడున్నర వరకు కూడా కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఒకే రోజు ఇద్దరు అగ్రనేతలు జిల్లాలో పర్యటిస్తుండటంతో అధికారులలో కాస్త టెన్షన్ మొదలైనది. పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయడం వల్ల కావచ్చు అలాగే నేతల్లో కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇటు హోర్డింగ్ లు ఏర్పాటు చేసిన స్వాగత  ఏర్పాటులో అందరూ కూడా బిజిబిజీగా ఉన్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనబడుతుంది.ఇక ఈ సమావేశాలు ఎలా జరగబోతున్నాయో వేచి చూడాలి.