ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోంది: బడా పారిశ్రామికవేత్త సెన్సేషనల్ కామెంట్

 

 

ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పిపిఏలు, పోలవరం తో సహా అనేక విషయాల పై సమీక్షలు జరుగుతన్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయం పై బడా పారిశ్రామికవేత్త మోహన్‌ దాస్‌ పాయ్‌ సంచలన ట్వీట్‌ చేశారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందన్నారు. పీపీఏలపై ప్రభుత్వం సమీక్ష జరపడంపై మోహన్‌దాస్‌ పాయ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జపాన్ కంపెనీలు లేఖ రాసిన తర్వాత అయినా జగన్ ప్రభుత్వం కళ్లు తెరుచుకోవద్దా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం  ఇలాగే చేస్తే ఏపీకి పరిశ్రమలు ఎలా వస్తాయన్నారు. పరిశ్రమలను దెబ్బతీసి.. రాష్ట్రాన్ని ఆర్ధికంగా దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని అయన తన ట్విట్లో పేర్కొన్నారు. ఏపీ భవిష్యత్‌ను జగన్‌ సర్వ నాశనం చేస్తున్నారన్నారని అయన మండి  పడ్డారు. అంతే కాకుండా ఆయన ట్వీట్‌ను నేరుగా జగన్‌కే ట్యాగ్ చేశారు. ఏపీ భవిష్యత్‌ను దెబ్బతీసే నిర్ణయాలు వద్దని మే నెలాఖరులో జగన్‌కు ఓ సారి పాయ్‌ లేఖ రాశారు. ఆర్యన్‌ క్యాపిటల్‌ అధినేత, అక్షయపాత్ర సహవ్యవస్థాపకుడుగా మోహన్‌ దాస్‌ పాయ్‌ ఉన్నారు. అలాగే కర్ణాటకలోని పలు పెద్ద పెద్ద కంపెనీల్లో మోహన్‌దాస్‌ పాయ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.