TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం జగన్ ను ముద్దాడిన స్వరూపానంద స్వామి

Published on: Tue Jun 4, 2019 2:31PM

 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ చేరుకున్న వైఎస్‌ జగన్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి జగన్‌ ప్రత్యేక కాన్వాయ్‌లో శారదా పీఠానికి చేరుకున్నారు. శారదాపీఠంలో వేదపండితులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

శారదా పీఠానికి చేరుకొన్న జగన్ వెంటనే పంచె కట్టుకొని శారదా పీఠాధిపతి స్వరూపానంద వద్దకు చేరుకొని  ఆశీస్సులు తీసుకొన్నారు. జగన్ ను స్వరూపానందస్వామి ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని.. జగన్ ను ముద్దాడి తన ప్రేమను వ్యక్తం చేశారు. అనంతరం పీఠం అధిదేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ నెల 8వ తేదీన జగన్ తన మంత్రివర్గాన్ని కూడ విస్తరించనున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముహుర్తం గురించి కూడ జగన్ స్వరూపానందతో చర్చించే అవకాశం ఉంది.