TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ షిఫ్ట్ చేస్తున్నారు.. ముహూర్తం కూడా ఫిక్స్

Published on: Mon May 13, 2019 1:43PM

 

వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ లో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని.. టీడీపీ పదే పదే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇక నుంచి టీడీపీకి విమర్శలు చేసే అవకాశం ఇవ్వకూడదని జగన్ డిసైడ్ అయ్యారు. అందుకే ఆయన త్వరలోనే తన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అమరావతికి షిఫ్ట్ చేస్తున్నారు. ఈ నెల 23 న ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో గెలుపు పై ధీమాగా ఉన్న జగన్.. ఇక నుంచి అమరావతిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. 21వ తేదీ మంచి ముహూర్తం కావడంతో ఆరోజు నుంచి జగన్ విజయవాడలోని తన సొంత ఇంట్లోనే ఉండనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 21వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాలను అమరావతి నుంచే జగన్ చేపట్టనున్నారు. ఇప్పటికే అమరావతిలోని పార్టీ కార్యాలయానికి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి ఫర్నీచర్ ను పంపించివేస్తున్నట్లు సమాచారం.