ఆ ఇద్దరు సొంత పార్టీ ఎమ్మెల్యేలకి క్లాస్ పీకిన జగన్

 

ఏపీ సీఎం జగన్ సొంత పార్టీ నేతలను కూడా ఖాతరు చేయడం లేదు. తనకు నచ్చనట్టు ప్రవర్తిస్తే ఎక్కడికక్కడ వారి అహంకారానికి బ్రేకులు వేస్తున్నారు. తాజాగా ఆయన ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లాస్‌ తీసుకున్నారట. ప్రకాశం జిల్లాకి చెందిన దర్శి , సంతనూతలపాడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపుకు కీలక పాత్ర పోషించిన బూచేపల్లి శివప్రసాదరెడ్డిని పక్కన పెడుతున్నట్టు వస్తున్న ఆరోపణలతో జగన్‌ వారి మీద సీరియస్‌ అయినట్టు చెబుతున్నారు. 

నిజానికి దర్శి టికెట్‌ బూచేపల్లికే ఇచ్చేందుకు ముందుగా జగన్ ప్లాన్ చేసినా ఏవేవో కారణాలు చెప్పి బూచేపల్లి అక్కడి నుండి పోటీ చేయలేదు. దీంతో అప్పుడే తెలుగుదేశం నుండి వచ్చి పార్టీలో చేరిన మద్దిశెట్టి వేణుగోపాల్‌కు దర్శి టికెట్ ఇచ్చారు. మరోపక్క సంతనూతలపాడు విషయంలోనూ ఆయన గెలుపుకు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఆయన వర్గం పూర్తి స్థాయిలో పనిచేశారు. 

సొంత డబ్బు కూడా ఖర్చు చేసి వీరిద్దరి గెలుపుకు కృషి చేస్తే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ ఇద్దరూ బూచేపల్లిని దూరంపెడుతూ వచ్చారు. ఇలా తాను టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకున్న ఎమ్మెల్యేలు తననే కాదనే రేంజ్ కి వెళ్లినట్టు జగన్‌ దృష్టికి బూచేపల్లి శివప్రసాదరెడ్డి తీసుకెళ్లారట. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిపించుకుని జగన్ కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఒక వారం క్రితం సంగతి అయినా తాజాగా వెలుగులోకి వచ్చింది.