మేడమ్ 11 లక్షలు చెక్కా క్యాషా.. ఫోన్ కాల్ తో వణికిపోయిన ఆ మంత్రి!!

 

ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులతో మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితులలోను అవినీతిని సహించనని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఐతే అడపా దడపా కొంత మంది ఎమ్మెల్యేలు కక్కుర్తి పడుతున్నట్లు తెలియగానే వారికి క్లాస్ పీకినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఒక మహిళా మంత్రి అధికారుల బదిలీల విషయంలో సొమ్ము చేసుకునే ఆలోచన చేశారట. దీని కోసం దాదాపుగా 11 లక్షలకు డీల్ కుదిరినట్లు సమాచారం. సొమ్ముల కలెక్షన్ వ్యవహారం సాక్షాత్తు ఆ మంత్రి భర్త గారికే అప్పగించారట. ఐతే కరెక్టుగా సొమ్ములు చేతులు మారే సమయంలో మంత్రి గారికి ఒక ఫోన్ కాల్ వచ్చిందట. మేడమ్ 11 లక్షలు చెక్కా లేక క్యాషా అంటూ అటు వైపు నుండి వినిపించడం తో ఆమె షాక్ కు గురయ్యారట. దానికి కారణం ఫోన్ లో అటు వైపున్నది సాక్షాత్తు సీఎం కావడమే. తరువాత ఆ మహిళా మంత్రి సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. ఐతే సీఎం మాత్రం మీకు మీ పిల్లలకు ఏమైనా ఖర్చులు ఉంటె డైరెక్ట్ గా నన్ను అడగండి కానీ ఇలా కలెక్షన్ కౌంటర్లు తెరవవద్దని హెచ్చరించినట్లు సమాచారం.